.jpg)
.jpg)








.jpg)
శివం అంటే శుభం, శివరాత్రి అంటే శుభాలనిచ్చేరాత్రి అని అర్థం.
శివరాత్రి పండుగను యావత్తు భారతదేశం జరుపుకొంటుంది.
మహాశివరాత్రి పండుగ , మాఘమాసం,బహుళచతుర్ధశి రోజు
అమావాస్యకు ముందు వస్తుంది.
ఆదిభగవానులైన బ్రహ్మ దేవుడు,శ్రీనివాసుడు,కుబేరుడు,ఇంద్రుడు,
సూర్యుడు,చంద్రుడు,అగ్నిభగవానుడు, మొదలగువారు
శివరాత్రి వ్రతం గావించి ఉన్నతదేవుళ్ళుగా పేరుగాంచారు.
ఈ శివరాత్రివ్రతాన్ని ఫలానా వారే చేయాలని నియమమేమీ లేదు.
ఎవరైనా ఆచరించవచ్చు.
సర్వవిధ పాపాలను హరించగల శక్తి కల్గినట్టి వ్రతం ఈ శివరాత్రీ వ్రతం.
!!! !!! శివరాత్రి చరిత్ర !!! !!!
పూర్వం బ్రహ్మా , విష్ణువులు పరమేశ్వరుణ్ణి విస్మరించి తమలో తామే
నేను గొప్ప అంటు వాదించు కుంటున్న సమయంలో వారి మధ్యన పరమేశ్వరుడు
ఆది అంటాము లేని విధగా, ఒక మహాజ్యోతి లింగారుపమున ప్రత్యక్షం అయ్యాడు.
శివుని ఆది అంటాము కనబడక పోవడంతో బ్రహ్మా , విష్ణువులు శివుని అనుగ్రహం కోరారు.
శివుడు నీల కంఠము,త్రినేత్రంతో కూడుకొన్న తన విశ్వరూపాన్ని చూపించాడు.
ఆయన విశ్వరుపానికి బ్రహ్మా విష్ణువులు విస్మయం చెంది, శివునికి ఇరువైపులా చేరి
పూజలు గావించారు. శివమహిమను, అందరికీ చాటి చెప్పారు.
శివరాత్రి వ్రతాన్ని పాటించి బ్రహ్మా విష్ణువులు పరమశివుని కృప సంపాదించారు.
!!! శివరాత్రి ఎలా ఏర్పడింది ? !!!
ప్రళయ కాలంలో బ్రహ్మ ,అతను సృష్టించిన సర్వజీవరాసులు అతలాకుతలమయ్యే
అంతిమదశలో ఉమా మహేశ్వరి పరమశివుణ్ణి ధ్యానించింది. ఆ రాత్రంతా నాలుగు జాములు
అర్చనలు ఆచరించి పరమశివుణ్ణి ఒక వరం కోరింది. " రాత్రంతా మేలుకొని నేను మీ నామస్మరణ చేసి, పూజా రాధనలు గావించినందువల్ల, మీ పవిత్ర నామం పేరిట దేవతలు,
మానవులు శివరాత్రి అనేపండుగా చేసుకోవాలి. శివరాత్రి నాడు సూర్య అస్తమయం
మొదలుకొని సూర్యోదయం వరకు ఎవరైతే పూజలు నిర్వహిస్తారో వారికి సర్వ భోగాలు
మోక్షం ప్రసాదించాలి, అనుగ్రహించండి స్వామీ " అని పరమశివుణ్ణి వేడుకుంది.
శివుడు ప్రత్యక్షమై "అందరు శివరాత్రి జరుపుకుంటారు " అని వరం ప్రసాదించాడు.
కాబట్టి మనము శివరాత్రి చేసి శివుని నామస్మరణతో ఆ నాడు గడపాలని
అందరిని కోరుతూ ....ఓం నమః శివాయ నమో నమః
మహిళలకు మంగళ కరమైనదీ , శుభదాయకమైనది , ముత్తైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా , సందడిగా జరుపుకొనే ఈ దసరాపండుగ మన భరతీయ సంసౄతీ , సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు ఇక ఈ పండుగలో స్పెషల్ ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మనసంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసిభాగ్యదాయినీ ,సౌభాగ్యప్రదాయిని అయిన ఆ దేవిని ఒక్కోరోజు ఒక్కోక్క దేవిని కొలిచి మీకు తెలిసిన ముత్తైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపురాసి కుంకుమపెట్టి తాంబూలాలతో వారిని సంతుస్టులను చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి . ఆ తల్లిని ప్రసన్నురాలిని చేసుకొని సకల సౌభాగ్యలు అష్ట ఐశ్వర్యాలు కావాలని కోరుకొని వచ్చిన పేరంటాలు అమ్మవారిమీద పాటలుపాడి ఆరతులు ఇచ్చి అక్షంతలు వేసి పూజించాలి .
ఈ దసరా పండుగకి మనము ఆ తల్లికి చేయవలసిన నైవేద్యము ,ఆ తల్లికి ఇష్టమైన రంగు చెపుతాను చూడండి.
1)బాలత్రిపుర సుందరి( నీలం రంగు ) నైవేద్యం (ఉప్పు పొంగల్ )
2)గాయిత్రిదేవి ( పసుపు రంగు ) నైవేద్యం ( పులిహోర )
3)అన్నపూర్ణాదేవి( లేత ఎరుపు ) నైవేద్యం కొబ్బెర అన్నం )
4) శ్రీలలితా త్రిపుర సుందరి ( ఆకాషం రంగు )నైవేద్యం ( అల్లం గారెలు )
5)సరస్వతిదేవి (కనకాంబరం రంగు ) నైవేద్యం ( పెరుగన్నం )
6)మహాలక్ష్మిదేవి ( తెలుపు రంగు )నైవేద్యం ( రవకేసరి )
7)దుర్గాదేవి ( మెరుణ్ కలర్ )కదంబం . అంటే వెజిటబుల్ , రైస్ కలిపి వండే ఐటం )
8) మహిషాసురమర్ధిని ( ఎఋఋఅటి ఎరుపు రంగు )నైవేద్యం ( బెల్లమన్నం )
9)రాజరాజేశ్వరి ( ఆకుపచ్చ రంగు ) నైవేద్యం ( పరమాన్నం )
ఇలా 9 రోజులు తొమ్మిదిరకాల వంటకాలతో ఆ తల్లికి ఆరగింపులుచేసి ప్రసన్నులుకాండి .
తక్కినవంటకాలు మీ ఇష్టనికే వదిలేసాము:)
1)శ్రియః కాంతాయ కల్యాణ నిధయే నిధయేర్ధినాం
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం
2)లక్ష్మీసవిభ్రమాలోక సుభ్రూవిభ్రమచక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం
3)శ్రీ వేంకటాద్రిశృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం
4)సర్వావయవసౌందర్య సంపదా సర్వచేతసాం
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళం
5)నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే
సర్వంతరాత్మనే శ్రీమ ద్వేంకటేశాయ మంగళం
6)స్వత స్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశయ మంగళం
7)పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశయ మంగళం
8)అకాలతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతాం
అతృప్త్యమృతరూపాయ వేంకటేశయ మంగళం
9)ప్రాయ స్స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా
కృపయా దిశతే శ్రీమ ద్వేంకటేశాయ మంగళం
10)దయామృతతరంగిణ్యా స్తరంగైరివ శీతలైః
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళం
11)స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే
సర్వార్తిసమనాయూస్తు వేంకటేశాయ మంగళం
12)శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే
రమయా రమమాణాయ వేంకటేశయ మంగళం
13)శ్రీమత్సుందరజామాతృ మునిమానసవాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం
14)మంగళాశాసనపరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృతాయాస్తు మంగళం!!