Sunday, July 26, 2009

Wednesday, July 22, 2009

మహా శివ రాత్రి స్పెషల్





శివం అంటే శుభం, శివరాత్రి అంటే శుభాలనిచ్చేరాత్రి అని అర్థం.
శివరాత్రి పండుగను యావత్తు భారతదేశం జరుపుకొంటుంది.
మహాశివరాత్రి పండుగ , మాఘమాసం,బహుళచతుర్ధశి రోజు
అమావాస్యకు ముందు వస్తుంది.
ఆదిభగవానులైన బ్రహ్మ దేవుడు,శ్రీనివాసుడు,కుబేరుడు,ఇంద్రుడు,
సూర్యుడు,చంద్రుడు,అగ్నిభగవానుడు, మొదలగువారు
శివరాత్రి వ్రతం గావించి ఉన్నతదేవుళ్ళుగా పేరుగాంచారు.
ఈ శివరాత్రివ్రతాన్ని ఫలానా వారే చేయాలని నియమమేమీ లేదు.
ఎవరైనా ఆచరించవచ్చు.
సర్వవిధ పాపాలను హరించగల శక్తి కల్గినట్టి వ్రతం ఈ శివరాత్రీ వ్రతం.

!!! !!! శివరాత్రి చరిత్ర !!! !!!

పూర్వం బ్రహ్మా , విష్ణువులు పరమేశ్వరుణ్ణి విస్మరించి తమలో తామే
నేను గొప్ప అంటు వాదించు కుంటున్న సమయంలో వారి మధ్యన పరమేశ్వరుడు
ఆది అంటాము లేని విధగా, ఒక మహాజ్యోతి లింగారుపమున ప్రత్యక్షం అయ్యాడు.
శివుని ఆది అంటాము కనబడక పోవడంతో బ్రహ్మా , విష్ణువులు శివుని అనుగ్రహం కోరారు.
శివుడు నీల కంఠము,త్రినేత్రంతో కూడుకొన్న తన విశ్వరూపాన్ని చూపించాడు.
ఆయన విశ్వరుపానికి బ్రహ్మా విష్ణువులు విస్మయం చెంది, శివునికి ఇరువైపులా చేరి
పూజలు గావించారు. శివమహిమను, అందరికీ చాటి చెప్పారు.
శివరాత్రి వ్రతాన్ని పాటించి బ్రహ్మా విష్ణువులు పరమశివుని కృప సంపాదించారు.

!!! శివరాత్రి ఎలా ఏర్పడింది ? !!!


ప్రళయ కాలంలో బ్రహ్మ ,అతను సృష్టించిన సర్వజీవరాసులు అతలాకుతలమయ్యే
అంతిమదశలో ఉమా మహేశ్వరి పరమశివుణ్ణి ధ్యానించింది. ఆ రాత్రంతా నాలుగు జాములు
అర్చనలు ఆచరించి పరమశివుణ్ణి ఒక వరం కోరింది. " రాత్రంతా మేలుకొని నేను మీ నామస్మరణ చేసి, పూజా రాధనలు గావించినందువల్ల, మీ పవిత్ర నామం పేరిట దేవతలు,
మానవులు శివరాత్రి అనేపండుగా చేసుకోవాలి. శివరాత్రి నాడు సూర్య అస్తమయం
మొదలుకొని సూర్యోదయం వరకు ఎవరైతే పూజలు నిర్వహిస్తారో వారికి సర్వ భోగాలు
మోక్షం ప్రసాదించాలి, అనుగ్రహించండి స్వామీ " అని పరమశివుణ్ణి వేడుకుంది.
శివుడు ప్రత్యక్షమై "అందరు శివరాత్రి జరుపుకుంటారు " అని వరం ప్రసాదించాడు.
కాబట్టి మనము శివరాత్రి చేసి శివుని నామస్మరణతో ఆ నాడు గడపాలని
అందరిని కోరుతూ ....ఓం నమః శివాయ నమో నమః




శ్రీ రామ నవమి



శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే
సహశ్రనామ తత్‌తుల్యం రామనామ వారాననే! (2)

రాముడుద్భవించినాడు రఘుకులంబునా

చైత్రమాసం,పునర్వసు నక్షత్రం,నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించెను.
నవమి నాడే సీతామహాదేవితో వివాహముజరిగెననీ,
నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగెనని రామాయణ కావ్యము తెలుపుచున్నది.
శ్రీ రామ చంద్రునికి నవమికి వున్న యీ సంబంధం వల్ల శ్రీరామనవమి పండుగను
భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో నవమి నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

శ్రీరామ నవమి వేసవి కాలంలో వచ్చే పండుగ.చైత్ర శుద్ధ నవమి నాడు,
అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.

వందే రఘునందనం
దక్షిణే లక్ష్మణో ధ్వనీ వామతో జానకీ శుభా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం
యత్రరామో భయం నాత్ర నాస్తి తత్రపరాభవః
సహి శూరో మహాబాహుః పుత్రో దశరధస్య చ !!

కుడివైపు ధనర్ధుడైన లక్ష్మణునితో
ఎడమవైపు శుభ లక్ష్మణ అయిన జానకీదేవితో,
ఎదురుగా ఆంజనేయునితో ఉన్న ఆ రఘునందనునికి వందనం.
శూరుడు,మహావీరుడూ, అయిన రాముడు ఎక్కడ వుంటాడో
అక్కడ భయమనేది వుండదు.

రామ మహిమ, రామనామమహిమ ఎంతటివంటే
రాముని చరితలో ఒక్క అక్షరమే మహాపాతకాలను
నశింపజేస్తుందని మహాకవి మనకు హామీ ఇస్తున్నారు.
రాముడు కల్యాణ గుణధాముడు.పావన చరితుడు.
జగత్తులోని మంచినంతటినీ రాశిపోయగా ఏర్పడినవాడే జగదభిరాముడు.
అందుకే రాముడూ,రామాయణమూ ఉన్నచోట అంతా శుభమే కాని,దారిద్య్రాము,
ధఃఖమూ,అనేవి వుండవు.లౌకిక ఆధ్యాత్మికాల మధ్య సేతువు కట్టినవాడు రాముడు.
ఆ రెంటి మధ్య తేడా లేదనీ ఆచరణలో బోధించిన వాడు రాముడు.
ఆ సుగుణాభిరామిని జీవితగాధ నుంచి ఏ కొంచం స్ఫుర్తించినా,
ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోంటాం.అటువంటి పుణ్యశ్లోకుని,
పురుషోత్తముని స్మరించుకొనే శ్రీరామ నవమి పర్వదినం ఈ మాసంలోనే.
ఈ వసంతం ప్రతి ఒక్కరి జీవితంలోనూ నవ్యవసంతాన్ని నింపాలనీ
కోరుకొంటూ ఉగాది శ్రీరామ నవమి సంధర్భంగా
బ్లాగు ప్రజలందరికీ నా హౄదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

పూజకైనా వినాయకధ్యానం,సంకల్పం,పూజ చేసె దేవునికి
షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి
ఆపై శ్రీరామాష్టకం,శ్రీరామ అష్టోత్తరం,జానకీ అష్టకం పఠించి
పూవులతో పూజ చేయాలి.చైత్రమాసం మల్లెలమాసమే గనుక
మల్లెపూవులతో పూజించడం శుభప్రదం.
మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు
ఏదైన సువాసనలుగల తెల్లరంగు పూవులతో సీతాలక్షమ్ణాంజనేయ
సమేత శ్రీరామ పఠానికి పూజించాలి.

వడపప్పు,పానకం, శ్రీరామయ్యకు ప్రీతి. అంటే స్వామి
ఖరీదైన వ్యయప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ
స్వామి సాత్వికుడనీ భక్తులనుండి పిండివంటలుగాక పరిపూర్ణ భక్తి
విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడనీ మనకు అర్థం కావాలి.

వడపప్పు స్నానానికి ముందుగా నానబెట్టుకోకూడదు.
స్నానానంతరం మొదట వడపప్పు నానబెట్టుకొంటే,
తక్కిన వంటలు పూజాదికాలు పూర్తయి,నైవేద్య సమయానికి
ఎలాగూ నానుతుంది.ఆరోజు ఏ వంట చేయాలనుకొన్నారో
ఆ వంట పూర్తిగావించి అదికూడా నైవేద్యం చేయాలి.
వీటితోపాటు ఏదైన ఒక ఫలం నివేదించాలి.

పూజ పూర్తయి నైవేద్యం అయ్యకా తప్పనిసరిగా ఒక ముత్తైదువకు
గానీ,కుటుంబ సభ్యులు, లేక బందువర్గంలోని పెద్దవారికి గాని
శక్త్యానుసారం తాంబూలం ఈ ప్రసాదాలు,వంటలలో కొంత భాగం
ఇచ్చి,కాళ్ళకు నమస్కరించాలి.ఆనాటి రాత్రి ఏదైన అల్పాహారంతో
ఉపవాస దీక్ష చేయాలి.పండ్లు,పాలతో గడిపితే మరింత శ్రేష్టం.
అంటే ఈ పూజరోజున ఒకపూట భూజనం చేయాలన్నమాట
చైత్రమాసంలోని పునర్వసు,నక్షత్రాలలో కుదరకపోతే
ఏ నెలలోనైన పునర్వసు నక్షత్రాలలో ఈ పూజ చేసుకోవచ్చు.

భక్తి కుముదంలోని కొన్ని ఆణిముత్యాలను ఇక్కడ పొందు పరిచాను.
దీని మూలకంగా ఎవరినైన బాధించినా,
తప్పులున్నా క్షమించమని ప్రార్థన.

సరస్వతి దేవి కవచం

1)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః
2)ఓం శ్రీం హ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు
3)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరం
4)ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు
5)ఓం శ్రీం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు
6)ఓం శ్రీం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు
7)ఓం శ్రీం హ్రీం ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు
8)ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కదౌమే శీం సధా వతు
9)ఓం శ్రీం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు
10)ఓం శ్రీం హ్రీం హేతి మమహస్తౌ సదావతు
11)ఓం శ్రీం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు
12)ఓం శ్రీం హ్రీం స్వాహా ప్రాచ్యాం సదా వతు
13)ఓం శ్రీం హ్రీం సర్వజిహ్వాగ్రవాసివ్యై స్వాహాగ్ని రుదిశిరక్షతు
14)ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు
15)ఓం ఐం హ్రీం శ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు
16)ఓం ఐం హ్రీం శ్రీం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సాదావతు
17)ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు
18)ఓం ఐం హ్రీం శ్రీం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు
19)ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యం సదావతు
20)ఓం ఐం హ్రీం శ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు
21)ఓం ఐం హ్రీం శ్రీం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు

సరస్వతి ప్రార్ధన



యాకుందేందు తుషారహారధవళా,యాశుభ్ర వస్ర్తావృతా
యావీణా వరదండమండితకరా,యా శ్వేత పద్మాసనా।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ,భగవతీ,నశ్శేష జాడ్యాపహా।।

సకల దేవేత గాయత్రి మంత్రములు

1)నంది గాయత్రీ
తత్ పురుషాయ విద్మహే
చక్ర తుండాయ ధీమహి తన్నో నంది:ప్రచోదయాత్!
2)నంది గాయత్రీ
తత్ పురుషాయ విద్మహే
చక్ర తుండాయ ధీమహి తన్నో నంది: ప్రచోదయాత్!
3)గరుడ గాయత్రీ
తత్ పురుషాయ విద్మహే
సువర్ణ పక్ష్య ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్!
4)కాత్యాయని గౌరీ గాయత్రీ
ఓం సుభాకయై విద్మహే
కళా మాలిని ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్!
5)భైరవ గాయత్రి
ఓం భైరవాయ విద్మహే
హరిహరబ్రహ్మాత్ మహాయ ధీమహి
తన్నో స్వర్ణాఘర్షణ భైరవ ప్రచోదయాత్!

6) ధన్వంతరి గాయత్రీ
ఓం తత్ పురుషాయ విద్మహే
అమృత కలశ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్!
[ లేక ]
ఓం ఆదివైధ్యాయ విద్మహే
ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్!
7)దక్షిణామూర్తి గాయత్రి
ఓం తత్ పురుషాయ విద్మహే
విద్యా వాసాయ ధీమహీ తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్!
8)కుబేర గాయత్రి
ఓం యక్ష రాజాయ విద్మహే
అలికదీసాయ దీమహే తన్న:కుబేర ప్రచోదయాత్!
9) మహా శక్తి గాయత్రీ
ఓం సర్వసంమోహిన్యై విద్మహే
విస్వజననయై ధీమహీ తన్నః శక్తి: ప్రచోదయాత్!
10)షణ్ముఖ గాయత్రీ
ఓం దత్త పురుషాయ విద్మహే
మహా సేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్!
11)సుదర్శన గాయత్రీ
ఓం సుధర్శనయ విద్మహే
మహా జ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయాత్!
12)శ్రీనివాస గాయత్రీ
నిర్నజనయే విద్మహే
నిరపసయే ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్!
13)శ్రీనివాస గాయత్రీ
నిర్నజనయే విద్మహే
నిరపసయే ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్!
14)కామ గాయత్రి
ఓం కామదేవాయ విద్మహే
పుష్పబాణాయ ధీమహి,తన్నోऽనంగః ప్రచోదయాత్!
15)హంస గాయత్రి
ఓం పరమహంసాయ విద్మహే
మాహాహాంసాయ ధీమహి,తన్నోహంస:ప్రచోదయాత్!
16)హయగ్రీవ గాయత్రి
ఓం వాగీశ్వరాయ విద్మహే
హయగ్రీవాయ ధీమహి,తన్నోహయగ్రీవ:ప్రచోదయాత్!
17)నారాయణ గాయత్రి
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి,తన్నోనారాయణ:ప్రచోదయాత్!
18)బ్రహ్మ గాయత్రి
ఓం చతుర్ముఖాయ విద్మహే
హంసారూఢాయ ధీమహి,తన్నోబ్రహ్మ:ప్రచోదయాత్!
19)సీతా గాయత్రి
ఓం జనక నందిన్యై విద్మహే
భూమిజాయై ధీమహి,తన్నోసీతా:ప్రచోదయాత్!
20)దుర్గా గాయత్రి
ఓం గిరిజాయై విద్మహే
శివప్రియాయై ధీమహి,తన్నోదుర్గా ప్రచోదయాత్!
21)సరస్వతీ గాయత్రి
ఓం సరస్వత్యై విద్మహే
బ్రహ్మపుత్ర్యై ధీమహి,తన్నోదేవీ ప్రచోదయాత్!
22)రాధా గాయత్రి
ఓం వృషభానుజాయై విద్మహే
కృష్ణ ప్రియాయై ధీమహి,తన్నోరాధా ప్రచోదయాత్!
23)కృష్ణ గాయత్రి
ఓం దేవకీ నందనాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి,తన్నోకృష్ణ:ప్రచోదయాత్!
24)విష్ణు గాయత్రి
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి,తన్నోవిష్ణు:ప్రచోదయాత్!
25)తులసీ గాయత్రి
ఓం శ్రీతులస్యై విద్మహే
విష్ణుప్రియాయై ధీమహి,తన్నో బృందా: ప్రచోదయాత్!
26)పృథ్వీ గాయత్రి
ఓం పృథ్వీదేవ్యై విద్మహే
సహస్రమూర్త్యై ధీమహి,తన్నోపృథ్వీ ప్రచోదయాత్!
27)అగ్ని గాయత్రి
ఓం మహా జ్వాలాయ విద్మహే
అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్ని: ప్రచోదయాత్!
28)వరుణ గాయత్రి
ఓం జలబింబాయ విద్మహే
నీల పురుషాయ ధీమహి,తన్నోవరుణ:ప్రచోదయాత్!
29)యమ గాయత్రి
ఓం సూర్యపుత్రాయ విద్మహే
మాహాకాలాయ ధీమహి,తన్నోయమ:ప్రచోదయాత్!
30)ఇంద్ర గాయత్రీ
ఓం సహస్రనేత్రాయ విద్మహే
వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర:ప్రచోదయాత్!
31) నవగ్రహ గాయత్రీ
సూర్య:: ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య: ప్రచోదయాత్
చంద్ర:: ఓం అమ్రుతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్ర : ప్రచోదయాత్
కుజ:: ఓం అన్గారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న : కుజ : ప్రచోదయాత్
బుధ:: ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ : ప్రచోదయాత్
చంద్ర :: ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురు : ప్రచోదయాత్
శుక్ర :: ఓం భార్గవాయ విద్మహే మంద గ్రహాయ ధీమహి తన్న : శని : ప్రచోదయాత్
రాహు :: ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహి తన్నో రాహు : ప్రచోదయాత్
కేతు :: ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో
32)ఆంజనేయ గాయత్రీ
ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్
ఓం అంజనీ సుతాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి,తన్నోమారుతి:ప్రచోదయాత్!
33)గణేశ గాయత్రీ
ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ దేమహి
తన్నో దంతి:ప్రచోదయాత్!
34)శివ గాయత్రీ
ఓం తత్పురుషాయ విద్మహే
మహా దేవాయ ధీమహి తన్నో శివః ప్రచోదయాత్!
35)లక్ష్మీ గాయత్రీ
ఓం మహాదేవ్యై చ విద్మహే
విష్ణు పత్న్యై చ ధీమహీ
తన్నో లక్ష్మిః ప్రచోదయాత్!

శుక్లాం బర ధరం విష్ణుం ప్రయెర్



Suklaam bara Dharam Vishnum
Sashi Varnam Chatur Bhujam
Prasanna Vadhanam Dhyaayet
Sarva Vighna Upa shaanthaye

Santa Kaaram Bhujaga Shayanam
Padma nabham Suresham
Vishva dharam Gagana Sadrsham
Megha Varnam Subhangam

Lakshmi Kantam Kamala Nayanam
Yogibhir Dhyana Gamyam
Vande Vishnum Bhava Bhaya Haram
Sarva Lokaiaka Natham(2)

Oushade Chinthaye Vishnum,
Bhojane cha Janardhanam,
Shayane Padmanabham cha
Vivahe cha Prajapathim
Yuddhe Chakradharam devam
Pravase cha Tri vikramam
Narayanam Thanu thyage
Sreedharam priya sangame
Duswapne smara Govindam
Sankate Madhu soodhanam
Kaanane Naarasihmam cha
paavake Jalashayinam
Jalamadhye Varaham cha
Parvathe Raghu nandanam
Gamane Vaamanam Chaiva
Sarva Karyeshu Madhavam.

Shodasaithani Naamani
Prathar uthaaya ya padeth
Sarva papa vinirmuktho
Vishnu Lokai mahiyati(5)